ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనినే థర్మోబారిక్ బాంబ్ అని పిలుస్తారు. ఇది న్యుక్లియర్ బాంబు కాకపోయినా, విధ్వంసం మాత్రం ఆ…
ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. Read:…
అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర…
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోంది ఉక్రెయిన్ సైనం. ప్రజలు సైతం… ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఎక్కడి కక్కడ రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. రష్యా దాడికి నిరసనగా రోడ్లపై నిరసన…
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం నాల్గో రోజుకు చేరుకోగా..మూడోరోజు ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యా సైన్యం… మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. సిటీల్లోకి ట్యాంకులు చొచ్చుకెళ్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఉన్నది కొద్ది పాటి సైన్యం. రష్యాకున్నంత ఆయుధ సంపత్తి లేదు. అయినా ఉక్రెయిన్ సైనికులు వెన్నుచూపడం లేదు. ప్రపంచంలోనే ఓ అమేయశక్తి నేరుగా దాడి చేస్తున్నా.. మాతృభూమిని రక్షణలో ప్రాణాలర్పిస్తున్నారు. మా ప్రాణమున్నంతవరకూ మా మాతృభూమిని ఆక్రమించలేరంటూ… పోరాట…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు.…
విద్యార్ధులు విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికి గుర్తుకు వచ్చే దేశం ఉక్రెయిన్. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసించేందుకు వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ట్యాంకర్లలో కొన్నింటిపై జెడ్ అనే అక్షరం రాసున్నది. ఆ అక్షరం ఏంటి? ఎందుకు జెడ్ అక్షరాన్ని దానిపై రాస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్‌లోని రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే, రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులోనూ క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలంటే ఓ బ్రిడ్జి మీద నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలి. ఈ బ్రిడ్జిని కూల్చివేస్తే రష్యా సేనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఆ బ్రిడ్జిని కూల్చివేసేందుకు బాంబులు అమర్చింది. Read: Crazy News: విజయ్…