Telugu Students Troubles: పోలాండ్ లో తెలుగు విద్యార్ధుల వెతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది.
రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దాడులు ప్రారంభమైన తర్వాత రష్యా అధీనంలోకి వెళ్లిన తొలి పట్టణం ఖేర్సన్. అజోవ్ సముద్ర తీరంలోని కీలక “మరియుపోల్” ఓడ రేవుని చుట్టుముట్టిన రష్యా సేనలు యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని, ప్రజలను, దేశ చరిత్రను ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రష్యా ప్రయత్నం చేస్తుందని నిందించారు అధ్యక్షుడు జెలెన్ స్కీ.
Also Read
రష్యా దాడుల తర్వాత ఇప్పటివరకు సుమారు 9 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని వీడి వెళ్ళారని చెప్పింది ఐక్యరాజ్య సమితి. అటు పోలాండ్ లో చిక్కుకుపోయిన 400 మంది తెలుగు విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. చలి మంచు ఎక్కువగా వుండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం తరపున కమ్యూనికేట్ చేసే వారు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారిని త్వరగా తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడ కు చేరుకోనుంది ఇండిగో విమానం. మధ్యాహ్నం 12 గంటలకు రానున్న విమానంలో విజయవాడ చేరుకోనున్నారు ఉక్రెయిన్ విద్యార్థులు హారతి, రమ్యశ్రీ, అజయ్.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?