రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్‌లో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నారు. ఇదిలా వుంటే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపకపోతే 70 లక్షల మంది వలస వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ పట్టుబడుతుండగా.. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తమ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులు సహా ఇతర దేశస్తులు సురక్షితంగా దేశాన్ని విడిచి వెళ్లేలా సాయం…
ఉక్రెయిన్ లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయ విద్యార్ధులను, పౌరులను త్వరగా స్వదేశానికి తరలించాలని రాజ్యసభలో టీడీపీ నేత కనకమేడల రవీందర్ కుమార్ కేంద్రాన్ని కోరారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానలో ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్దులను కలుసుకుని క్షేమసమాచారాలు తెలుసుకున్నారు ఎంపీ కనకమేడల. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు ఢిల్లీలో అన్నిరకాల సహాయాన్ని స్వయంగా దగ్గరుండి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.అక్కడినుంచి వచ్చే విద్యార్థుల వెతలను, చేదు అనుభవాలను విదేశీ వ్యవహరాల మంత్రి దృష్టికి…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై…
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి భీకర పోరు సాగిస్తోంది రష్యా… ఇక, ఉక్రెయిన్ నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం అవుతుంది.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే కాగా.. ఇదే అంశంపై…
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్‌ను గడగడలాడిస్తోంది. అంతేధీటుగా ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా సైనిక దళాలపై దాడి చేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఉక్రెయిన్‌కు వివిధ దేశాలు మద్దతుగా నిలిచి, ఆయుధాలను అందిస్తున్నాయి. అయితే తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘ఏఎన్-225 మ్రియా’ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానంగా , అత్యంత పొడవైన బరువైన విమానంగా కూడా ‘ఏఎన్-225 మ్రియా’ రికార్డ్ నెలకొల్పింది. ఆంటోనోవ్ ఎఎన్-225 మ్రియా…
రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకోవాలని రష్యా భావిస్తుండగా.. ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. మరోవైపు.. ఇప్పటికే తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం అని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా.. రష్యాతో చర్చలకు అంగీకారం తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. కాగా, బెలారస్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయని రష్యన్ మీడియా మాస్కోలో ప్రకటించింది. చర్చల కోసం బెలారస్‌కు ఉక్రెయిన్ బృందం బయలుదేరింది.…
ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటంతో ప్రజలు ఆ దేశం నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడుతున్నారు. ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న పోలెండ్ బోర్డర్‌కు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డర్లోకి వచ్చే వారికి ఎలాంటి వీసాలు అవసరం లేదని, డైరెక్ట్‌గా రష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి రావొచ్చని స్పష్టం అధికారులు స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులు పోలెండ్ బోర్డర్‌కు చేరుకుంటున్నారు. అయితే, పోలెండ్ బోర్డ్ర్కు చేరుకున్న విద్యార్థులను అక్కడి బోర్డర్లో సైనికులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. విదేశీ…
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నది. రష్యన్ సేనలు పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి యుద్ధం చేస్తున్నాయి. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రష్యన్ సేనలు నగరాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నగరాల్లోకి ప్రవేశించిన సేనలు ట్యాంకులకు ఆయిన్ ను నింపుకోవడానికి ఆగినపుడు మాల్స్‌లోకి ప్రవేశించి దుస్తులు, డ్రింక్స్, తినుబండారాలు అందిన కాడికి దోచుకొని పోతున్నారు. ఓ స్టాల్ లోకి ప్రవేశించిన సైనికులు వివిధ వస్తువులను లూటీ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో…
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే కరోనా కారణంగా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
ఉక్రెయిన్ నుంచి భారత్‌కు విద్యార్ధులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 700 మందికి పైగా విద్యార్ధులను ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తరలించారు. ఉక్రెయిన్ నుంచి ఇండియాకు కేంద్రం ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాలకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తున్నది. ఒక్కో విమానం ఇండియా నుంచి వెళ్లి అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొని ఇండియాకు రావడానికి సుమారు రూ.…