ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లోని చిక్కుకుపోయిన భారతీయ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ఖార్కివ్‌లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. యుద్ధభూమి ఖార్కివ్‌ను తక్షణం వీడాలని స్పష్టం చేసింది ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఖార్కివ్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఈ కీలక సూచనలు చేసింది.. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని పేర్కొంది.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు చేరుకోవాలని వెల్లడించింది.. మొత్తంగా నాలుగు గంటల్లో ఖార్కివ్‌ను భారతీయులు ఖాళీ చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Ukraine Russia War: మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణు విధ్వంసమే..!
కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, భారత పౌరులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు.. ప్రాణాలను పణంగా పెట్టి, భారతీయ విద్యార్థులు జాతీయ జెండా పట్టుకుని ఖార్కివ్‌లో గుంపులుగా నడుస్తూ.. రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.. 700 మంది భారతీయులతో సహా 1,000 మంది భారతీయ జెండాను పట్టుకుని రైల్వే స్టేషన్ నడుస్తూ వెళ్లారు.. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కాలినడకన ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వేస్టేషన్‌కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశం నుండి విద్యార్థులు మరియు కార్మికులు, ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు బుధవారం నాడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత జాతీయ జెండాను పట్టుకుని సమీప రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఒక విద్యార్థి తండ్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.