PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలన్స్కీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని జెలన్‌స్కీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు తీసుకురావడానికి మద్దతు ఇస్తుందని ప్రధాని, జెలన్స్కీకి తెలియజేశారు. భారతదేశం మానవతా…
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచాలని ఆదేశించారు. మాస్కో నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా సైన్యం, పౌరుల భద్రతను బలోపేతం చేయడం పుతిన్ ఆదేశం వెనుక ఉద్దేశం. బోర్డర్ డిఫెన్స్ డే సెలవుదినం సందర్భంగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)కి చెందిన బోర్డర్ సర్వీస్‌కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడారు.
United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా..…
Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు దాటుతోంది. అయినా రష్యా తన దురాక్రమణను ఆపడం లేదు. ముందుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకుందాం అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ బలగాలు ఎదురొడ్డి నిలిచాయి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాల ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరించాయి. దీంతో కీవ్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో మారణహోమాన్ని సృష్టిస్తోంది. తూర్పు ప్రాంతంలోనో డోన్ బాస్ లో…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది… రష్యా దాడులు తీవ్రతరం చేసినా.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది.. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.. ఇక, రష్యా ఓవైపు దాడులు చేస్తున్నా.. మరోవైపు, దేశాన్ని వీడేది లేదు.. ఇక్కడే ఉంటాం.. దేశాన్ని కాపాడుకుంటాం.. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అయితే, జెలెన్‌స్కీపై రష్యా మీడియా తాజాగా ప్రసారం…
రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసింది రష్యా.. అయితే, రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా తమపై…