Pakistan: పాక్ ఆర్థిక సంక్షోభం.. 20-25 బిలియన్ డాలర్లు పెట్టేందుకు యూఏఈ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఇంధనం, పోర్ట్ కార్యకలాపాలు, మురుగునీటి శుద్ధి, ఆహార భద్రత, లాజిస్టిక్స్, మైనింగ్, విమానయానం మరియు బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఎంఓయూల ఖచ్చితమైన సమచారం తెలియనప్పటికీ.. యూఏఈ, పాకిస్తాన్‌లో 20-25 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొంత కాలంగా కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ద్రవ్యోల్భణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు దేశాలను అప్పుల కోసం అభ్యర్థిస్తోంది. విదేశీమారక నిల్వలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతులు తగ్గాయి. చివరకు పాకిస్తాన్ తన పాస్ పోర్టులను ముద్రించుకోవడానికి కూడా కాగితాన్ని దిగుమతి చేసుకోలేకపోతోంది. దీంతో పాటు అక్కడి గ్యాస్, విద్యుత్, ఇంధనం ధరలు పెరిగాయి. ప్రజలు వీటిని తగ్గించాలని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నారు.
అంతకుముందు పాక్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తో సమావేశం నిర్వహించారు. దీనికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ఆర్థిక రంగంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చినందుకు ఆ దేశ ప్రధాని కాకర్ యూఏఈకి థాంక్స్ తెలిపారు. COP2 సదస్సుకు యూఏఈ ప్రెసిడెన్సీకి ఇస్లామాబాద్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..