అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్‌లకు సంబంధించిన రికార్డు లేదా ప్రపంచ రికార్డు వచ్చినప్పుడల్లా.. రోహిత్ శర్మ, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిదిలే గుర్తుకు వస్తారు. కానీ 2023లో సిక్సర్ రారాజు ఎవరో తెలుసా.. ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఈ ఏడాదిలో సిక్సర్ల సెంచరీని సాధించలేకపోయాడు. UAEకి చెందిన కెప్టెన్ మహమ్మద్ వసీమ్ ఆ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డలకెక్కాడు. 2023లో 47 మ్యాచ్ లు ఆడిన వసీమ్.. (టెస్ట్ లు, టీ20లు) 101 సిక్సులను తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. క్రిస్ గేల్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లకు కూడా ఈ ఘనత సాధించలేదు.
Read Also: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు-మావోయిస్టులు మధ్య కాల్పులు.. 6 నెలల చిన్నారి మృతి
2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో మహమ్మద్ వసీం మొత్తం 101 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో.. రోహిత్ శర్మ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 80 సిక్సర్లు కొట్టాడు. వసీం వన్డే, టీ20లు మాత్రమే ఆడాడు. కాగా.. రోహిత్ శర్మ 2019లో 78 సిక్సర్లు, 2018లో 74 సిక్సర్లు కొట్టాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ 2022లో 74 సిక్సర్లు కొట్టాడు. 2017లో రోహిత్ 65 సిక్సర్లు కొట్టాడు.
Read Also: CJI DY Chandrachud: ఆర్టికల్ 370పై మాట్లాడేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు సీజేఐ
ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
101 సిక్సర్లు – ముహమ్మద్ వసీం (2023లో UAE తరపున)
80 సిక్సర్లు – రోహిత్ శర్మ (2023లో భారత్ తరఫున)
78 సిక్సర్లు – రోహిత్ శర్మ (2019లో భారత్ తరఫున)
74 సిక్సర్లు – రోహిత్ శర్మ (2018లో భారత్ తరఫున)
74 సిక్సర్లు – సూర్యకుమార్ యాదవ్ (2022లో భారత్ తరఫున)
65 సిక్సర్లు – రోహిత్ శర్మ (2017లో భారత్ తరఫున)