Dubai: గల్ఫ్ కంట్రీ యూఏఈ భారతీయులకు శుభవార్త చెప్పింది. దుబాయ్ ఇండియన్స్ కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు వ్యాపారం, విహారయాత్రలను సులభతరం చేయనున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ కంట్రీ యూఏఈ-భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతమవుతున్నాయి. మరోవైపు విహారయాత్రకు అనువైన ప్రదేశంగా భారతీయులు దుబాయ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఖతార్ వెళ్లారు. ఇటీవల ఖతార్‌లో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో ఖతార్ దిగి వచ్చి వారందర్ని విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా ఇండియా చేరుకున్నారు.
Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.
అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని (Hindu Temple) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. యూఏఈ చరిత్రలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్పై ప్రశంసలు కురిపించారు. నా ‘సోదరుడు’ అంటూ సంబోధించారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. యూఏఈ ప్రెసిడెంట్‌తో చర్చల తర్వాత అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ‘ అల్హన్ మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తాను తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2015లో యూఏఈ పర్యటనను ప్రధాని గుర్తు…
యూఏఈలోని (UAE) అబుదాబిలో (Abu Dhabi) మంగళవారం జరిగిన ‘అహ్లాన్ మోడీ’ (Ahlan Modi) కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి మోడీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రవేశించి అందరికీ అభివాదం చేశారు.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో (Abu Dhabi) పర్యటిస్తున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి.