ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్…
ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం. ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద…
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే…
యువ రచయిత, దర్శకుడు బీవీయస్ రవి ఏ విషయం గురించి అయినా తన మనసులో మాటను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. అయితే ఆ ముక్కుసూటి తనమే ఇటీవల ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ – బీవీయస్ రవి మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ కు కారణమైంది. బీవీయస్ రవి చేసిన ఓ ట్వీట్ ను హరీశ్ శంకర్ విమర్శించాడు. తన వాదనను బలపరుస్తూ బీవీయస్ రవి సెటైరిక్ గా చేసిన వ్యాఖ్య అది…
టాలీవుడ్ ప్రముఖుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుభవించమని ఒకరంటే… పిరికితనం అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు. సాధారణంగా టాలీవుడ్‌లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. ఎప్పుడూ పబ్లిక్‌గా గొడవలకు దిగరు. తమకు విభేదాలు వచ్చినా ప్రైవేట్‌గానే సాల్వ్ చేసుకుంటారు. కానీ బహిరంగ వేదికపై పోరుకు దిగరు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే…
ఏపీలో స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ సంచలనం రేపుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ఱంరాజు. తాజాగా ఆయనపై ట్వీట్లు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు రఘురామ. అంతకుముందు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా…