ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం.
ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద ఉంచింది.పదవ తరగతి విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా భావించాలి.విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చేరాలని బలవంతపెట్టడం దారుణం.ఐటీ రంగంలో తెలుగువారు ముందుండడం చంద్రబాబు ఘనతే.ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేయడం బాధాకరం.చంద్రబాబులాంటి విజనరీ ముఖ్యమంత్రికి , జగన్ లాంటి ప్రిజనరీ ముఖ్యమంత్రికి తేడా తెలుస్తోందన్నారు నరేంద్ర.
దైవంతో సమానమైన గురువులను మద్యం షాపుల ముందు నిలబెట్టారు. గురువులను గౌరవించని నీచులు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నానని లెక్చర్ ఇవ్వడం విడ్డూరం. మూడేళ్లుగా పాఠశాలలు తెరవకుండానే పది మందికి ఇంగ్లిష్ నేర్పిన ఘనత నాదేనని చెప్పుకున్నారు. అప్పుడు లేని సిగ్గు పదో తరగతి పరీక్షల రిజల్ట్స్ రివర్స్ అయితే వచ్చిందా..? అని మండిపడ్డారు ట్విట్టర్లో బుద్దా వెంకన్న.
టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి స్టేషన్ లో తన్నులు తిన్నా పాస్ కాని నత్తి పకోడీ రెడ్డి.2 లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి 3 వేల కోట్లు అమ్మ ఒడి డబ్బు మిగుల్చుకోవాలని కన్నింగ్ ప్లాన్ వేసాడు.పనికి మాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్స్ రివర్స్ అయ్యాయి, విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందంటూ ట్వీటేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.
Renuka Chowdhury : స్త్రీలకు రక్షణ లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే…