ఏపీలో స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ సంచలనం రేపుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ఱంరాజు. తాజాగా ఆయనపై ట్వీట్లు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు రఘురామ.
అంతకుముందు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే! అంటూ విజయసాయి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా రఘురామ కూడా కౌంటర్ అటాక్ చేశారు. మొత్తం మీద అటు విజయసాయి, రఘురామ సోషల్ మీడియా వార్‌తో ఆంధ్రా రాజకీయం రక్తికడుతోంది. ఇందులో ఎవరూ తగ్గడం లేదు.
నువ్వు, నీ ఏ1 నన్ను ఎంత కవ్వించి రప్పించి చంపాలని చూస్తున్నారో నాకు తెలీదా ఏ2. ఇంటి నుంచి బయటకు పరదాలు కట్టుకుని ఎవరు వస్తున్నారో అందరికీ తెలుసు. ముందు నువ్వు, నీ ఏ1 కోర్టుకి హాజరు అవ్వండి. నా కేసులు నేను చూసుకుంటానులే ఏ2. మీలాగే మీ ఆలోచనలు కూడా మరగుజ్జే! https://t.co/pewWdW7Otp
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 18, 2022