ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందే జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్ ని ఉదహరించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ @ysjagan గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! అంటూ నాదెండ్ల ట్వీట్ చేశారు.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు https://t.co/cthy29YWc5— Pawan Kalyan (@PawanKalyan) June 12, 2022