Turkey Earthquake : టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి సుమారు 50వేల మంది బలయ్యారు. ప్రపంచవ్యాంకు అంచనా ప్రకారం టర్కీ భూకంప నష్టం 342 కోట్ల డాలర్లు.. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల 2.82 లక్షల కోట్లు. ఈ ఏడాది జీడీపీలో కనీసం 0.50 శాతం నష్టపోయినట్లు అంచనా వేసింది. కాగా ఈ ఏడాది దేశ జీడీపీ 3.5 శాతం నుంచి 4 శాతంగా నమోదు కావచ్చునని వెల్లడించింది.
Read Also: Man Steal Flower Pots : ఖరీదైన ఎస్యూవీ కార్లో వచ్చి.. క్యా ‘కియా’ రే
ప్రస్తుతం టర్కీలో కూలిపోయిన ఈ భవనాలు నిర్మించాలంటే రెట్టింపు వ్యయం అవుతుందని ప్రపంచబ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. టర్కీ 80 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో భూమి కంపించిన ఆనవాల్లేవు. టర్కీలో భవన నిర్మాణానికి అక్కడి టౌన్‌ప్లానింగ్ డిపార్టుమెంటు లంచాలు తీసుకుని ఉదారంగా అనుమతులిచ్చింది. అధికారులు కళ్లు మూసుకొని అనుమతులు ఇవ్వడం వల్ల అమాయకులు బలయ్యారు. ప్రస్తుతం టర్కీ ప్రెసిడెంట్ నిబంధనలు పాటించని బిల్డర్లపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు.
Read Also: Hong Kong: మూడేళ్లయింది ఇక చాలు.. మాస్క్ తీసేయండి
టర్కీ భూకంపంతో సుమారు 12.5 లక్షల మంది నిర్వాసితులయ్యారు. తుర్కియేలోని మొత్తం 11 ప్రావిన్స్‌లలో అత్యధికంగా దక్షిణ టర్కీలో భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. దేశంలో అత్యధిక పేదరికం కూడా ఇక్కడే. ఈ ప్రాంతంలోనే సిరియాకు చెందిన 17 లక్షల మంది శరణార్థులు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచబ్యాంకు టర్కీ తక్షణ సాయం కింద 780 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది.