37 earthquakes strike Central Turkey in 66 hours: టర్కీ దేశాన్ని వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. ఈ నెల తొలివారంలో టర్కీని 7.8, 7.5 తీవ్రతతో ఉన్న రెండు శక్తివంతమైన భూకంపాలు తీవ్రంగా దెబ్బతీశాయి. టర్కీతో పాటు పొరుగున ఉన్న సిరియాలో కూడా తీవ్రంగా ఆస్తి, ప్రాణనష్టాలు వాటిల్లాయి. కొన్ని రోజలు వ్యవధిలోనే 1000కి పైగా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి టర్కీ భూభాగం ఏకంగా 5-6 మీటర్ల వరకు పక్కకు కదిలింది అంటే ఎంత శక్తితో భూకంపాలు వచ్చాయో తెలుస్తోంది.
ఇదిలా ఉంటే టర్కీని భూకంపాలు వదలడం లేదు. గడిచిన 66 గంటల్లో 37కి పైగా భూకంపాలు టర్కీలో నమోదు అయ్యాయి. దీంట్లో 5.5 తీవ్రతతో శనివారం మరో భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కీ ప్రాంతంతో ఈ భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 6న వచ్చిన భూకంపాల వల్ల ఇప్పటి వరకు టర్కీ సిరియాల్లో కలిపి 50,000 మంది మరణించారు. ఇందులో ఒక్క టర్కీలోనే 45 వేల మంది మరణించారు. 1.5 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు.
Read Also: Lalu Prasad Yadav: 2024 ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెడతాం..
ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపాలలో 5,20,000 అపార్ట్‌మెంట్లతో కూడిన 1,60,000 భవనాలు కూలిపోయాయి. తాజాగా శనివారం టర్కీ ప్రభుత్వం భూకంప బాధితుల కోసం కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది మొదలుపెట్టిన రోజే మరోసారి భూకంపాలు రావడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏకంగా కొన్ని గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో భూకంపాలు వచ్చాయి.
టర్కీ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ ఫలితంగా భూకంపాలు వస్తున్నాయి. టర్కీ దేశం అనటోలియన్ టెక్టానిక్ ప్లేటుపై ఉంది. దీన్ని క్రమంగా అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ నెట్టేస్తోంది. దీని ఫలితంగా తీవ్ర ఒత్తడి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది. రానున్న రోజుల్లో కూడా టర్కీలో ఇలాగే భూకంపాలు వచ్చే అవకాశ ఉందని భూకంప నిపుణులు చెబుతున్నారు.