Husband Kills Wife: టర్కీలో దారుణం జరిగింది. విహారయాత్రకు తీసుకువచ్చి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫాతిహ్‌లోని ఒక హోటల్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని బ్రిటన్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తన భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు టర్కీకి వచ్చాడు.
Israel Attack: హమాస్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ ఇజ్రాయెల్‌పై పెద్ద చర్య తీసుకుంది. హమాస్‌తో కాల్పుల విరమణను తిరస్కరించినందుకు టర్కీ ఇజ్రాయెల్ నుండి తన రాయబారిని వెనక్కి పిలిపించింది.
Israel-Turkey: టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా వేల మంది జనాలతో అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ పాలస్తీనా అనుకూల ర్యాలీ నిర్వహించారు. వేల మంది సాక్షిగా ఇజ్రాయిల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయిల్ గత 22 రోజులుగా బహిరంగ యుద్ద నేరాలకు పాల్పడుతోందని, అయితే పాశ్చాత్య నాయకులు కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వలేదని ఎర్డోగాన్ అన్నారు.
Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని…
Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది.
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Turkey: ఇటీవల టర్కీలోని ప్రభుత్వ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోతున్న టర్కీ దానికి బాధ్యత వహించిన సంస్థ స్థావరాలను ధ్వంసం చేసింది.
Suicide Bombing: టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
Turkey On Kashmir: ఎన్నిసార్లు భారత్ చెబుతున్నా పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాడు.
Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు బద్ధశతృవులుగా మారాయి. ఈ శతృత్వం ప్రజలు, రాజకీయ నాయకుల్లో కూడా పేరుకుపోయింది. ఇందుకు ఓ వీడియో ప్రస్తుతం సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో గురువారం బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ…