తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి…
శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్‌కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీవాణి ట్రస్ట్…
అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతుంటారు.. ఇక, సర్వదర్శనం కోసం అయితే బారులు తీరుతుంటారు.. అయితే, టీటీడీ ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసిన అరగంటలోనే అన్నీ పూర్తి అయ్యాయి.. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లోపెట్టింది టీటీడీ.. రోజుకి 8వేల టోకెన్ల చొప్పున మొత్తం 2.79 లక్షల టికెట్లను విడుదల చేయగా… హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.. 25 నిముషాల్లోనే 2.4…
తిరుమల : రేపటి నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ లకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపింది. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేసింది. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్…
తిరుమల : 25 వ తేది నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేశారు. 26 తేదీ నుంచి…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో…
టీటీడీ బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు గళం ఎత్తగా….బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు హైకోర్టులో టీటీడీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపి ప్రభుత్వం నియమించిన జంబో టీటీడీ పాలకమండలి వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 81 మందితో పాలకమండలి ఏర్పాటును వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాశారు. 50 మందికి ఎక్స్ ఆఫిషియోగా అవకాశం ఇచ్చి బోర్డులో…