సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… శ్రీవారి దర్శనార్థం ఇవాళ తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోన్నారు. అంతేకాదు… ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్న ఎన్వీ రమణ… రేపు చక్రస్నానంలో పాల్గొననున్నారు.…
ఏపీ సీఎం జగన్ ఈ నెల 11, 12 తేదీల్లో తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు… సీఎం. తిరుపతిలో బర్డ్ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 11న రాత్రికి పద్మావతి…
టీటీడీ పాలకమండలి ఇవాళ జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదముద్ర వేసింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో టీటీడీ సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం లభించగా.. చెన్నై కేంద్రానికి ఏజే శేఖర్ రెడ్డి, బెంగళూరు కేంద్రానికి రమేష్ శెట్టి, ముంబై కేంద్రానికి అమోల్ కాలేను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, అలిపిరి కాలిబాట సుందరీకరణ…
ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వాహనసేవలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని… ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామని చెప్పారు. చక్రస్నాన కార్యక్రమాని ఆలయంలోని అద్దాల మహల్…
తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి…
శ్రీవారి దర్శనానికి TTD అనేక వెసులుబాటులు కల్పించింది. ఆర్థిక స్థోమత.. పరిచయాల ఆధారంగా తమకు వీలైన మార్గాన్ని ఎంచుకుంటారు భక్తులు. కాకపోతే వెసులుబాటులను లాభసాటి వ్యాపారంగా చూసేవారు కూడా కొందరు ఉన్నారు. ఈ విషయంలోనే విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కానీ.. ఓ ఘటనలో TTD విజిలెన్స్ ఇచ్చిన ప్రకటన.. చర్చగా మారింది. ఆలయ పరిపాలనపై విజిలెన్స్‌కు అవగాహన లేదా అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చింది ఆ ప్రకటన. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. శ్రీవాణి ట్రస్ట్…
అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం…