కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ ఆన్ లైన్ లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్నారు. సెప్టెంబర్ మాసంకు సంబంధించిన టోకెన్లు ఉదయం 9 గంటలకు విడుదల చెయ్యనుంది టీటీడీ. వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు మినహయించి మిగిలిన రోజులకు సంబంధించిన టికెట్లు విడుదల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. 7 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Read Also:Jr Ntr Meets Amit Shah At Novatel: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ కీలక భేటీ
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,523 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 4.65 కోట్ల రూపాయలని టీటీడీ తెలిపింది. మరోవైపు భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోతుండడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా లక్షలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అయితే 80 వేలు, 86 వేలకు మించి భక్తులను దర్శనానికి అనుమతించడం కుదరదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఆగమశాస్త్ర నిబంధనలే అందుకు కారణం. తిరుమలలోని వివిధ ఆలయాల్లో జరగాల్సిన పూజలు, కైంకర్యల్లో అవలంభించాల్సిన నియమాలు, ఇతర విషయాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాలి. దానిని కాదని నిర్వహించడం కుదరదు. స్వామివారికి సుప్రభాతం మొదలుకొని.. ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమ బద్దంగానే నిర్వహిస్తారు. టైం స్లాట్ ప్రకారం ఆలయం లోపలికి వెళితే 2 గంటల లోపే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. సాధారణ సమయాలలో 8 నుంచి పది గంటలు, ఇక రద్దీ వారాంతాల్లో 24 నుంచి 48 గంటలు శ్రీవారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి వసతి కల్పించడం టీటీడీకి ఇబ్బందిగా మారుతుంది.
Read Also: Miss Universe beauty pageant: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో పెళ్లైన మహిళలకు అనుమతి