టీటీడీలో అర్హత వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని.. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్ట్ మరియు కార్పొరేషన్ పరిధిలో వున్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
Rishabh Pant, Axar Patel Visits Tirupati Balaji Temple Today: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఈ ఇద్దరు స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తితిదే ఆలయ అధికారులు పంత్, అక్షర్కి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి.. స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం…
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది.