తిరుమలలో ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ తెలిపింది. ఇక, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 1వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి. అలాగే, ఈ నెల 22వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ విధానంలో టోకేన్లు జారీ చేసింది. రోజుకి 42, 500 చోప్పున పది రోజులుకు సంభందించి 4.25 లక్షల టోకేన్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు జారీ చేయనుంది. పది రోజులు పాటు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక సేవలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Read Also: Suma Kanakala : కళ్లముందే కొడుకు చేసిన పనికి షాక్ అవుతున్న సుమ..అయ్యో పాపం..
అలాగే, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇప్పటికే 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 61, 499 మంది భక్తులు దర్శించుకున్నారు. 24, 789 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 4.14 కోట్ల రూపాయల హుండి ఆదాయం వచ్చింది.