Mukkoti Ekadasi: తిరుమలలో ముక్కోటి రద్దీ.. వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukkoti Ekadasi 2023: తిరుమలలో ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. శనివారం వేకువజామున 1.30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తం శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. తొలుత ప్రముఖులకు, అనంతరం సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుగిరులపై ఎటు చూసినా భక్తజనసందోహంలా మారింది. నేటి నుంచి జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుపతిలోని కౌంటర్ల దగ్గర వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకు వాహన మండపంలో భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రేపు ఉదయం 4 గంటలకు ద్వాదశి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. తిరుమలకు పెరిగిన వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. తిరుమలకు మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు.
Read Also: Mukkoti Ekadasi: నేడు ముక్కోటి ఏకాదశి.. ఉత్తర ద్వార దర్శనం రహస్యం గురించి తెలుసా?
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
వైకుంఠ ద్వార దర్శనాన్ని వేకువజామున 1:30 గంటలకు ప్రారంభించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 4,008 వీఐపీ టికెట్లు జారీ చేస్తే.. 3,850 టికెట్లపై భక్తులు దర్శనానికి విచ్చేశారని తెలిపారు. సర్వదర్శనం భక్తలకు 6 గంటల నుంచి దర్శన టోకెన్లు జారీ చేసినా వారికి 5:15 గంటలకే దర్శనాలు ప్రారంభించామన్నారు. టోకెన్ కలిగిన భక్తులకు రెండు గంటల సమయంలోనే స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నామన్నారు. పదిరోజులలో 8 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. 23న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 22న సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ముందుగానే ప్రకటించింది. అయితే భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం లైన్‌లో స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు అంతకుముందే తెలిపారు. దీంతో శుక్రవారం కొందరు భక్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకోగా సిబ్బంది అనుమతించలేదు. అప్పటికే వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లు నారాయణగిరి వద్దకు చేరుకున్నాయి. దీంతో దర్శనానికి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణగిరి నుంచి జేఈవో కార్యాలయం దగ్గరకు వారు చేరుకుని ఆందోళన చేశారు. అప్రమత్తమైన అధికారులు అలిపిరి దగ్గర 23వ తేదీ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. కొందరు భక్తులు వసతి గదుల కోసం ఇబ్బందిపడుతున్నారు.
Read Also: Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ
ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచన చేస్తోంది.. కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని సూచిస్తోంది. టికెట్లు లేని వారు కూడా రావొచ్చు.. కానీ ఎలాంటి దర్శనాలు వారికి ఉండవంటున్నారు. అలిపిరి టోల్‌గేట్ దగ్గర భక్తుల దర్శన టికెట్లను విజిలెన్స్ సిబ్బంది పరిశీలించి.. టికెట్లు ఉన్నవారిని కొండపైకి పంపుతున్నట్లు తెలుస్తోంది. వైకుంఠద్వార దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను అలిపిరి చెక్‌పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో అనుమతించారు. అవి లేని భక్తులను వెనక్కు పంపారు. అలాగే దర్శన సమయానికి 24 గంటల ముందు మాత్రమే ఎంట్రీ అని చెప్పడంతో చాలామంది అలిపిరి నుంచి వెనుదిరిగారు. తిరుమల స్థానికులను కూడా ఆధార్ కార్డులు చూశాకే తిరుమలకు పంపారు. తిరుమలలోనూ దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే గదులను కేటాయించారు. ఈ 10 రోజుల పాటూ టీటీడీ సిఫార్సు లేఖల్ని కూడా రద్దు చేసింది.. వీఐపీలు స్వయంగా వస్తేనే దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!