తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.
సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.…
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.
అయోధ్య ఆలయానికి భక్తజనాన్ని నియంత్రించడం ఇప్పుడు ఒక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాది మందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ టీటీడీ సహకారాన్ని కోరింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.
ఇరాన్లో ఓ కొడుకు ఘాతుకం.. తుపాకీ కాల్పుల్లో 12 మంది మృతి ఇరాన్లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య…
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం…