తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తం చెప్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా…
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కీలక అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా, టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావు నియమితులయ్యారు. ఇంతవరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇదివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.