Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?
- నామినేటెడ్ పోస్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు..
- పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోను..
- ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం..
- కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు..
- నా కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… జనసేన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని మర్చిపోమని స్పష్టం చేశారు.. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందన్న ఆయన.. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి.. కానీ, ప్రతి ఒక్కరూ ఛైర్మన్ పదవులు ఆశిస్తే కష్టం. కొందరు టీటీడీ ఛైర్మన్ సహా ఇంకొన్ని ఛైర్మన్ల పదవులు అడగుతున్నారు. ఒక్క టీటీడీ ఛైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు.. కానీ, ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరు. అయితే, నా కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి అడగలేదు.. కానీ, నా కుటుంబ సభ్యులు టీటీడీ ఛైర్మన్ పదవి అడిగారని ప్రచారంలో పెట్టారు.. అది కరెక్ట్ కాదు.. అని హితవుపలికారు.
Read Also: OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెడుతున్న సుధీర్ బాబు సినిమా..ఎప్పుడు ఎక్కడంటే..?
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ఈ పదవుల కోసం చంద్రబాబుని ఎలా అడగాలో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.. మీకిది చేశాం కాబట్టి.. మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగలేం.. కానీ, అందరికీ న్యాయం చేసేలా నా వంతు ప్రయత్నం చేస్తా అన్నారు.. ఇదే సమయంలో ఎవరికైనా పదవి ఇవ్వలేకుంటే పెద్ద మనస్సుతో ఆలోచించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీని నేనూ కేబినెట్ పదవి అడగగలను.. కానీ, నేను అడగలేదు. పదవుల కోసం మనం పని చేయడం లేదు. ఎవరైనా ఏమైనా పదవి కావాలంటే అడగండి.. కమిటీలో చర్చించి పదవులిచ్చే ప్రయత్నం చేస్తాం అన్నారు. పదవులు అడిగే వాళ్లు.. వాళ్ల అనుభవాలను.. వారి అర్హతలకు దగ్గరగా ఉండే పదవులు అడగండి. లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ ఆలోచన చేయాలన్నారు.. నంద్యాల ఘటనల్లాంటివి జరగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఇక, మనోహర్ సివిల్ సప్లైస్ శాఖను సమర్ధవంతంగా పని చేస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం కట్టడికి నాదెండ్ల చర్యలు తీసుకుంటున్నారు. కేబినెట్‌లో రేషన్ అక్రమాలు సహా.. రాష్ట్రాభివృద్ధి కోసం చర్చిస్తాం అన్నారు. మరోవైపు.. కేంద్రంలోకి రావాలని.. మంత్రి పదవి ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కానీ, రాష్ట్రంలోనే ఉంటానని చెప్పాను. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతా.. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతా అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!