Tirumala Darshanam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు..
- టోకేన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 65, 392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29, 015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, హుండి ఆదాయం 4. 23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read Also: MLA Prakash Goud: బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్.. నేడు కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఇక, ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్పపల్లకిలో మలయప్పస్వామి దర్శనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందు కోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.
Read Also: Nepal : పెను ప్రమాదం…కొండచరియలు విరిగి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60మంది గల్లంతు
అలాగే, ఇందులో భాగంగా జూలై 18న మొదటి రోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ జరపగా, 19న గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేస్తామని అర్చకులు పేర్కొన్నారు. 20వ తేదీన ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ, సాయంత్రం కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వర స్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!