జగన్‌పై కేటీఆర్ మిత్ర ధర్మాన్ని పాటించారు వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు రఘురామకృష్ణం రాజు.…
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా నిన్న (మంగళవారం) సాయంత్రానికి క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం.. సభ నుంచి విపక్షాలు వాకౌట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగం సందర్భంగా విపక్షాలు నినాదాలు చేశాయి. అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.…
తిరుమల ఆలయంలో అన్నప్రసాదాల తయారీకి ఆర్గానిక్ బియ్యాన్ని ఉపయోగిం చాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తేల్చి చెప్పింది. సాధారణ బియ్యంతో పాత పద్ధతిని మార్చే ప్రతిపాదన లేదని బుధవారం టీటీడీ ప్రతినిధి స్పష్టం చేశారు , ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు “పూర్తిగా నిజం కాదు” అని అన్నారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు మరుసటి రోజు అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశమై…
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తం చెప్పింది. శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఉదయం 10 గంటలకు టీటీడీ ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. అలాగే.. తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను కూడా…
తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో టోకెన్ల స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. 1200 మెట్టు వద్ద స్కానింగ్ అనంతరం భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. గతంలో ఆలయ తలుపుల నుంచి టోకెన్ వెళ్లే విధానాన్ని టీటీడీ అధికారులు మార్చారు. అయితే స్కానింగ్ పద్ధతి లేకపోవడంతో నడకదారిలో భక్తులకు పంపే టోకెన్లు పక్కదారి పడటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు.