రక్షణ పరిశోధన బృందం అభివృద్ధి చేసిన కొత్త సాంకేతికత ఇప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం కోసం పర్యావరణ అనుకూలమైన , స్థిరమైన సంచులను అందించనుంది. డాక్టర్ కె వీరబ్రహ్మం, శాస్త్రవేత్త , డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని అతని బృందం PBAT, పెట్రోలియం ఉత్పత్తులు లేదా మొక్కల నూనెల నుండి తీసుకోబడిన బయోడిగ్రేడబుల్ పాలిమర్‌ను అభివృద్ధి చేసింది, ఇప్పుడు లడ్డూ ప్రసాదం పంపిణీకి ఉపయోగించబడుతుంది. ఈ సాంకేతికతను ఇప్పటికే 40 పరిశ్రమలకు ఉచితంగా బదిలీ…
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై విషయం కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.. ఈ రోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1500కి పరిమితం చేశాం అన్నారు.. శ్రీవాణి దర్శన టికెట్ల జారికి శాశ్వతప్రాతిపాదికన కౌంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు.
Tirumala Tickets: నేడు (జులై 24) ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీతో శ్రీవారి దర్శనానికి గంటల పాటు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉంటుంది. దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులు ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ ఆన్లైన్లో దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు టీడీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.