Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శానికి 8గంటల సమయం..
- తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు..
- టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం..
- శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో స్వామి వారిని ఈజీగా దర్శించుకుంటున్నారు. అతి తక్కువ టైంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఏడు కొండల మీద భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం కూడా భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
Read Also: Hydra: అమీన్ పూర్, కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు..
Also Read
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్నటి(శనివారం) వరకూ శ్రీనివాసుడి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టేది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తైతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 82 వేల 406 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31 వేల 151 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!