Minister Satya Kumar Yadav: లడ్డూ ప్రసాదం కల్తీపై మంత్రి సీరియస్.. క్షమించరాని నేరం.. వారిని వదిలిపెట్టం..
- తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై మంత్రి సత్యకుమార్ ఫైర్..
- లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసింది..
- తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు..
- విచారణ తర్వాత జగన్ సహా ఎవ్వరినీ వదిలిపెట్టమని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satya Kumar Yadav: భక్తులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది.. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలచివేసిందన్నారు.. ఇలాంటి నేరం ఎవరూ.. ఎప్పుడూ భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని వ్యాఖ్యానించారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారు.. టీటీడీని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నారు అంటూ మండిపడ్డారు..
Read Also: BJP Morcha: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. బీజేపీ మోర్చ ఘాటు విమర్శలు..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
ఇక, అన్య మతస్తుడిని టీటీడీ చైర్మన్ గా నియమించారు.. పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ… స్వామివారి ఆస్తులను తెగనమ్మడానికి ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి సత్యకుమార్.. క్షమించిరాని నేరం చేశారు.. కమీషన్ల కోసం లడ్డూ తయారీలో నాసిరకం నెయ్యి తీసుకుని వచ్చారు… ఒక కేజీ మూడు వందల రూపాయల వరకు వచ్చేలా అవినీతి చేశారు.. ఆ అవినీతి సొమ్ము జగన్ ఖాతలోకి వెళ్లాయని విరుచుకుపడ్డారు.. సమగ్ర విచారణ తర్వాత వైఎస్ జగన్ సహా ఇతర మాజీ చైర్మన్‌లను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!