తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..
తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉంది.
తిరుపతి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీటీడీపై రకరకాల పోస్టులు పెడుతున్నారు.. అయితే, సోషల్ మీడియాలో టీటీడీపై తప్పువు వార్తలు ప్రచారం చేయడం దురదృష్టకరం అన్నారు టీటీడీ చైర్మన్..
టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్త వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. సమీక్షలో టీటీడీ ఈవోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అజాగ్రత్తగా ఉండడం వల్లే ఇంతటి దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ప్రక్షాళన చేస్తానన్న నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు..
ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు..
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతాం అని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నాం.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు ముఖ్యమంత్రి.. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించినవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..
తిరుమల వెంకన్న స్వామి భక్తుల తాకిడి రోజురోజుకి ఎక్కువవుతుంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు కూడా సెలవులు రావడంతో స్వామి దర్శనానికి తిరుమలలో భక్తీ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనాలకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి మూడు నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు…