TTD: ఈనెల 28వ తేదీ నుండి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు
- ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
- అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ ఈవో శ్యామల రావు
- డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పంచమి తీర్థానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు.. ఆ రోజు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఈవో తెలిపారు. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు ముందు రోజు రాత్రి నుండే భక్తులకు కేటాయించిన ప్రాంతాల్లో భోజనం మొదలుకొని అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయని ఈవో పేర్కొన్నారు. పంచమి రోజున 1500 మంది అదనపు సిబ్బందితో భద్రత ఉంటుందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.
Read Also: Kalpana Soran: కేబినెట్‌లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
అంతకుముందు బ్రహ్మోత్సవాలపై ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ఈవో జే శ్యామలరావు అన్నారు.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!