TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నిరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు.. శ్రీవారిని దర్శించుకున్నారు.. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమయిందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.. అయితే, తిరుమల తిరుపతి దేవస్థానం నుండే ప్రక్షాళన మొదలుపెడతామని ప్రకటించారు.. తిరుమలలో ఓం నమో వెంకటేశాయా, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని పేర్కొన్న విషయం విదితమే.. ఇక, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామల రావుని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విధులు నిర్వహిస్తున్న శ్యామల రావును టీటీడీ ఈవోగా నియమించింది.
Read Also: Delhi: త్వరలో కేబినెట్ ముందుకు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నివేదిక