తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పదిలక్షల నూట పదహారుసార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కార్యక్రమం చేపట్టామని, భక్తులు నుంచి అద్భుత స్పందన వస్తోందన్నారు. నడక మార్గంలో చిరుత పులులు దాడులు అడ్డకట్టకు 5 కోట్లు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి అందించామని టీటీడీ…
పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం..
పార్వేట మండపం పునర్ నిర్మాణం చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
TTD Crucial Decisions: అలిపిరి నడక మార్గంలో దర్శనానికి వెళుతున్న బాలుడిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని శుక్రవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి చేసింది పిల్ల చిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్న ఈవో దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి వెళ్లి…
టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని…