గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేపట్టిన టీఎస్పీఎస్సీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరీక్షను వెంటనే వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-2 ఎక్జామ్ పై స్పష్టమైన హామీ వచ్చేదాకా కదిలేది లేదంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ఆఫీసు దగ్గర బైఠాయించారు. వాళ్లపై పోలీసులు లాఠీచార్జ్ చేసి.. అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
Read Also: Friday: శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకండి.. ఎందుకంటే?
అయితే, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించేలా తెలగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ వ్యవహారిస్తుందని పిటిషనర్లు ఆరోపించారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ తదితర నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే (జూన్ 26న, జులై 24న) రెండుసార్లు టీఎస్‌పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్లు తెలిపారు.
Read Also: Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
అయితే, తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ఎక్జామ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించాలా..? వాయిదా వేయాలా..? అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని కొందరు.. వద్దని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. వాయిదా వేస్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాతే నిర్వహించాల్సి వస్తుందని, డిసెంబర్ వరకు ఇతర పరీక్షలు ఉన్నాయని టీఎస్పీఎస్సీ తెలిపింది.