గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఫైనల్ కీని తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. తుది కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా 25వేల 150 మందిని మెయిన్స్‌కు టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనుంది.
Read Also: China President Xi Jinping: జిన్‌పింగ్ సంచలన నిర్ణయం… అణ్వాయుధ దళ టాప్ అధికారుల తొలగింపు
503 గ్రూప్-1 పోస్టులగానూ.. ఈ ఏడాది జూన్ 11వ తేదీన పరీక్షను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3లక్షల 80 వేల 81 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2లక్షల 32 వేల 457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే తాజాగా టీఎస్పీఎస్సీ ఫైనల్ కీలో మొత్తం ఎనిమిది ప్రశ్నలను డిలీట్ చేసింది. ఆప్షన్స్ మార్చిన సమాధానాలు రెండు ఉన్నాయి. ఇదే ఫైనల్ కీ అని.. దీని తర్వాత ఎలాంటి అబ్జక్షన్స్ తీసుకోమని తెలియజేశారు.
Read Also: Venu Yeldandi: వెకేషన్ సరే.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.. ?
ఇక ఫైనల్ కీ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. మెరిట్ జాబితా మాత్రం ఎప్పుడు విడుదల చేస్తోంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ జాబితా విడుదలకు కాస్త సమయం ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. మహిళల హారిజాంటల్, వర్టికల్ విధానం ద్వారా పోస్టుల కేటాయింపు జరుగనుండగా.. దీనిపై క్లారిటీ వచ్చాక రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఫలితాల తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ కు 3 నెలలు టైం ఉండేలా షెడ్యూల్ విడుదల చేసేందకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సెప్టెంబరు నెలాఖరు వరకు ఇప్పటికే ప్రకటించిన ఇతర పరీక్షలు ఉన్నాయి. దీంతో.. అక్టోబరు లేదా నవంబరులో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించే ఛాన్స్ ఉంది.