కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు. అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజనాలను మా ప్రభుత్వం…
నల్గొండ జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి.నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు గడువు లోపు పనులు చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. దీంతో జిల్లాలో వంద కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడ్డాయి. నల్గొండ జిల్లాలో 1835 కిలోమీటర్లు పనులు ఉన్నాయి. అందులో రాష్ట్ర రహదారులు 195 కిలోమీటర్లు కాగా మిగిలినవి జిల్లా రహదారులు 1636 కిలోమీటర్లు.ఈ…
2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు కొస్తున్నా వేతనాలు, బకాయిలు విడుదల కాకపోవడం పట్ల యుఎస్పీసీ ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లుల మంజూరు కోరుతూ బుధవారం డిటిఓ ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని యుయస్పీసీ తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల సత్వర మంజూరు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఉపాధ్యాయులు,…
అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT). నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కన్నెర్ర జేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటి. పిసటి…
తెలంగాణలో 317 జీవో విషయంలో జరిగినంత రచ్చ వేరే అంశంపై జరగలేదనే చెప్పాలి. ఉద్యోగులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి పరస్పర బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించింది. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పరస్పర బదిలీల్లో సర్వీస్ కోల్పోకుండా ఉత్తర్వుల్లో సవరణ చేసింది సర్కార్. సవరణ చేయడంతో పరస్పర బదిలీలకు దరఖాస్తులు పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. అర్హత గల స్పౌజ్ కేసులు అన్ని పరిష్కారం…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో…
317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగాఆలోచిస్తుంటే, అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది. తెలంగాణ వాళ్లకు,తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలన్నారు. ఆనాడు రాజ్ నాథ్ సింగ్…
తెలంగాణలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాల పై ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీజిఓ, టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. సీనియారిటీ లిస్ట్ తయారు, ఉద్యోగుల కేటాయింపు పై చర్చ జరిగింది. రేపటి వరకు సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు సీఎస్. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కేటాయించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. భార్య భర్తలకు ఒకే దగ్గర…
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని…