ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు.
ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజనాలను మా ప్రభుత్వం పరిరక్షిస్తుంది. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దన్నారు నిరంజన్ రెడ్డి.