తెలంగాణలో ఉద్యోగుల విభజన మార్గదర్శకాల పై ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి టీజిఓ, టీఎన్జీవో నేతలు హాజరయ్యారు. సీనియారిటీ లిస్ట్ తయారు, ఉద్యోగుల కేటాయింపు పై చర్చ జరిగింది. రేపటి వరకు సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలని ఆదేశించారు సీఎస్.
ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కేటాయించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. భార్య భర్తలకు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేటాయింపుల్లో ఒకే దగ్గర పోస్టింగ్ రాకపోతే ఆ తర్వాత చూద్దామని చెప్పారు అధికారులు. పోస్ట్ లేకున్నా సూపర్ న్యూమరీ పోస్ట్ లు క్రియేట్ చేయాలని కోరారు నేతలు. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్ ఫైనల్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదని సమాచారం. విద్యా సంవత్సరం ముగిసాకే టీచర్ల కేటాయింపు వుండాలన్నారు.