ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయనకు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఈ నెల 24న క్యాబినెట్ విస్తరణలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డి రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. గత ఎన్నికల్లో ఫలితాల అనంతరం మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్సీగా రెండుసార్లు ఛాన్స్ ఇచ్చింది.
Read Also: Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఇంటి అద్దె తెలిస్తే షాకే.. ఓ పది ఇళ్లు కొనేయొచ్చు..!
అయితే, ఎమ్మెల్సీగా ఉండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి స్థానంలో 2019 జూన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇక, తాజాగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పట్నం మహేందర్ రెడ్డి.. యాక్టివ్ పాలిటిక్స్ లో చూరుగ్గ పాల్గొననున్నారు. అయితే, తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డా.. మహేందర్ రెడ్డికి ఒప్పందంలో భాగంగా మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నారు.
Read Also: KA Paul: స్టీల్‌ప్లాంట్‌పై కేఏ పాల్ డెడ్‌లైన్.. లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష..!
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి మొదటి లిస్ట్ ను విడుదల చేశారు.. ఈ జాబితా తర్వాత పార్టీలో పలు మార్పులు చేర్చులు కొనసాగుతున్నాయి. టికెట్ వస్తుందని అశించిన పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో వారికి కేసీఆర్ ఇతర పదవులు ఇస్తామని హామీ ఇస్తుండగా.. మరి కొందరు తమకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు.