TSRTC Merger Bill: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య కొత్త వివాదాన్ని సృష్టించింది.. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.. అయితే, అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం.. కానీ, టీఎస్ఆర్టీసీ బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని గవర్నర్ పేర్కొన్నారు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని.. ప్రభుత్వం సరైన వివరణ వస్తే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు..
అయితే, గవర్నర్ అడిగిన ప్రశ్నలకు తాజాగా వివరణ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్‌కి వివరణ పంపించారు అధికారులు.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని వివరణలో పేర్కొంది ప్రభుత్వం.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత విధివిధానాలలో అన్ని అంశాలు ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వివరణ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కాగా, ప్రభుత్వం పంపించిన బిల్లును గవర్నర్ ఆపడంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్ పాటించిన విషయం విదితమే కాగా.. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత దాదాపు 10 మంది ఆర్టీసీ యూనియన్ లీడర్లను లోపలికి అనుమతించారు.. గవర్నర్‌కు మెమెరాండం ఇవ్వడంతో పాటు.. ఆమెతో ఆర్టీసీ విలీనం బిల్లుపై చర్చించనున్నారు నేతలు.
కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లే పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరిన విషయం విదితమే.