రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికుల నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి, ప్రతి నెల జీవన భృతి ఇవ్వాలి అంటూ ఆటో యూనియన్ నేతలు కోరారు.
Read Also: Lokesh Kanagaraj : ఇక పై ఆ పని చేయనంటున్న స్టార్ డైరెక్టర్..
ఆటో డ్రైవర్లకు నెలకు 10 వేల రూపాయలు ఇవ్వాలి అంటూ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, 5 లక్షల రూపాయల జీవిత భీమా కల్పించాలి అని కోరారు. ఉపాధి కోల్పోయినటువంటి మా ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కారించాలి అని వారు వినతి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం గేటు దగ్గర ఏవో రాంరెడ్డికి ఆటో యూనియన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.