టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంలో ఆర్టీసీ కార్మికులు, అధికారులతో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంపు కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డినీ కలిసి నిజామాబాద్ కు చెందిన ఆరు డిపోలమేనేజర్లు, ఆర్టీసీ కార్మిక కుటుంబాలు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు వారు అన్నారు.
Read Also: Karumuri Nageswara Rao: రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు..
బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను కూడా ఊహించలేదు.. నా హయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఈ కానుకను కాపాడుకోవాలి.. బాధ్యతతో ప్రతి ఒక్కరు వ్యవహరించాలి.. సంస్థను కాపాడుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటామని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అన్నారు.
Read Also: Reba Monica John : ఆ సూపర్ హిట్ మూవీ లో ఛాన్స్ మిస్ చేసుకున్న క్యూట్ బ్యూటీ..?
ఆర్టీసీ విలీనాన్ని బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సెక్టార్ లను అమ్ముకునే బీజేపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గు చేటు అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు, డీపో మేనేజర్లతో పాటు వారి కుటుంబాలు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోకు పాలభిషేకం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు పేర్కొన్నారు.