భూముల విక్రయానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. దీని కోసం కమిటీలు ఏర్పాటు చేసింది.. సీఎస్ సోమేష్ కుమార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే, భూముల అమ్మకాలను పర్యవేక్షించేందుకు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.. నోడల్ శాఖ భూముల ధరను నిర్ణయించి.. ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తుంది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా…
తెలంగాణ రేషన్ డీలర్స్‌తో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి.. రేషన్ డీలర్స్ ప్రధాన సమస్యలైన రూ.28 కోట్ల పాత బకాయిలు విడుదల చేసేందుకు సుముఖతం వ్యక్తం చేసింది ప్రభుత్వం.. ఇక, కరోనాతో చనిపోయిన డీలర్స్ కు ఎక్స్ గ్రేషియా, కాంటాకు బ్లూ టూత్ తీసివేయడం, కరోనాతో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా వారి కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్ కుమార్.…
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో నామమాత్రంగానే జరిగింది.. దీనికి వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణంగా ప్రకటించింది సర్కార్.. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని…
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేశారు బీజేపీ నేతలు.. అసలు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది…
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు… ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ.. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను వినియోగించుకునే వీలు కల్పించింది.. మిగతా టీకాలను వెంటనే సేకరించాలని హెల్త్ డైరెక్టర్ ఆదేశించారు.. కాగా, జనవరి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్…
కరోనా సెకండ్ వేవ్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు వెళ్తుందేమో అనే ప్రచారం కూడా సాగింది.. మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా.. సమీక్షలు, ఉన్నతస్థాయి సమావేశాలు జరిగితే మాత్రం.. ఏదో నిర్ణయం జరుగుతుందనే గుసగుసలు వినిపించాయి. ఇక, వాటికి ఫులిస్టాప్ పెడుతూ.. నైట్ కర్ఫ్యూ ను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… మరో వారం రోజులు నైట్ కర్ఫ్యూ అమల్లో…