గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరుకాకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. శాంతి సదస్సుకు రావాలని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు, ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు. కానీ మోడీ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఈజిప్టు వేదికగా గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. సోమవారం షర్మ్ ఎల్ షేక్‌లో అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ఆధ్వర్యంలో శాంతి శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ఆహ్వానించారు.
ఒక్కరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఏకంగా రెండేళ్లు చెరలో బందీలుగా ఉండిపోయారు. ఏదో రోజు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఎదురుచూపులకు నిరీక్షణ ఫలించింది. సోమవారం తొలి విడత బందీలను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని.. ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఈజిప్టు పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు డోనాల్డ్ ట్రంప్ బొటనవేలు పైకి చూపిస్తూ విజయ సంకేతం ఇచ్చారు.
ఎట్టకేలకు గాజాలో శాంతి పరిమళాలు వెదజల్లబోతున్నాయి. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత శాంతి ఒప్పందం విజయవంతంగా కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయనుంది.
గత నెలలో చైనా భారీ కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి 80 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో భారీ కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా 25 దేశాధినేతలంతా హాజరయ్యారు.
అమెరికాలో ముస్లింలు రాజకీయ పదవులు చేపట్టడాన్ని నిషేధించాలని దూర హక్కుల కార్యకర్త లారా లూమర్ పిలుపునిచ్చారు. అందుకోసం చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసింది.
గాజాలో పాలన పాలస్తీనీయుల చేతుల్లోనే ఉండాలని హమాస్, పాలస్తీనా వర్గాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఏదైనా బాహ్య జోక్యాన్ని గానీ విదేశీయుల ఆదిపత్యాన్ని గానీ అంగీకరించబోమని పేర్కొంది.
అమెరికాతో పాకిస్థాన్ సంబంధాలు క్రమక్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వైట్‌హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు మంచి ఆతిథ్యం లభించింది. ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు.
ట్రంప్ పరివర్తన చెందిన అధ్యక్షుడు అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశంసలతో ముంచెత్తారు. మంగళవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో మార్క్ కార్నీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.