గాజాలో పరిపాలన కోసం శాంతి మండలి (Board of Peace) ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరాలని దాదాపు 50 దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. భారతదేశంతో పాటు రష్యా, ఫ్రాన్స్.. ఇలా అగ్ర రాజ్యాలతో పాటు ముస్లిం దేశాలను ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌పై అగ్ర రాజ్యాల మధ్య రగడ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
ట్రంప్ శాంతి మండలిని ఫ్రాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందులో చేరబోమని తేల్చి చెప్పింది. ఇక రష్యా నుంచి అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే దావోస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. బోర్డ్ ఆఫ్ పీస్‌ను పుతిన్ అంగీకరించారని తెలిపారు. అయితే ఈ ప్రకటనను రష్యా విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. ఇక తొలుత ఇజ్రాయెల్ వ్యతిరేకించినా.. బుధవారం మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ పీస్‌ను అంగీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కొన్ని ముస్లిం దేశాలు కూడా స్వాగతించాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, టర్కీ, హంగేరీ సహా 35 దేశాలు బోర్డులో చేరడానికి అంగీకారం తెలిపాయి.
ఈయూ నుంచి వ్యతిరేకత..
ఇదిలా ఉంటే బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు యూరోపియన్ దేశాలు పూర్తిగా నిరాకరించాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ ఆగ్రహించి.. ఫ్రెంచ్ వైన్, షాంషైన్‌పై 200 శాతం సుంకం విధిస్తానని బెదిరించారు. అయితే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా బెదిరించడంతోనే ఫ్రాన్స్ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటలీ అయితే ఇది సమస్యాత్మకమైనదిగా పేర్కొంది. ఇక జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ అయితే దావోస్ పర్యటనకు డుమ్మా కొట్టారు. ఇదే కోవలో బ్రిటన్, జర్మనీ, జపాన్ కూడా ఇంకా స్పష్టమైన వైఖరి తెలియజేయలేదు. మొత్తానికి ట్రంప్ వైఖరి కారణంగానే ఈయూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్