ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వచ్చిందంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. ఓ వైపు అమెరికా కూడా శాంతి ఒప్పందం దగ్గరలోనే ఉందని చెబుతుండగా.. ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జన్‌పింగ్ మధ్య సోమవారం ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి మధ్య రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావనకు రావడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన డోజ్ (DOGE) శాఖను 8 నెలలకు ముందుగానే క్లోజ్ చేసేశారు. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖను ఏర్పాటు చేశారు.
నిన్నామొన్నటిదాకా ట్రంప్ కారాలు.. మిరియాలు నూరారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేశారో ఆ వ్యక్తికే ట్రంప్ షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు వైట్‌హౌస్ వేదికైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ వేదికగా జరుగుతున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల మధ్య మొదలైన యుద్ధాలన్నీ శాంతించాయి. దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాలు కూడా ముగిశాయి. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఇంకా ముగియలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించారు.
అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసే బిల్లుకు అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించారు. 427-1 తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ట్రంప్‌కు తీవ్రమైన మద్దతుదారుడు.. లూసియానా రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే ఓటు వేయలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ మధ్య నిన్నామొన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ముందు ఓ రేంజ్లో ట్రంప్ విరుచుకుపడ్డారు. మమ్దానీని నోటికొచ్చినట్లు మాట్లాడారు.
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
బీబీసీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ట్రంప్ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకతతో బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ సీఈవో ఇద్దరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.