గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఇంకా నాశనం కాలేదని.. యుద్ధం ముగించడానికి దగ్గరగా ఉన్నట్లు తెలిపారు.
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు.
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది.
రోజుకో మాట.. పూటకో పోస్ట్. ఏం చేసినా అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకోవటమే లక్ష్యం. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు. అందరూ నా గురించే మాట్లాడుకోవాలనుకుంటున్నారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.
హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ కొత్త డెడ్‌లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రావాలని కోరారు. లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత నరకం చూస్తారని హెచ్చరించారు.
Modi-Trump meet: అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివర్లో మలేషియా కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిసే అవకాశం ఉంది.
మైక్రోసాఫ్ట్‌లో కీలక హోదాలో ఉన్న లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం లీసా మోనాకో మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్ అఫైర్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బరాక్ ఒబామా హయాంలో జాతీయ భద్రతా సీనియర్ సలహాదారుగా కూడా విధులు నిర్వర్తించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రథమ మహిళ మెలానియా మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా చర్చించుకుంటున్నారు.
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సమావేశం అయ్యారు. దాదాపుగా 90 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిగాయి. మీడియాను లోపలికి అనుమతించలేదు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు.