మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో నిఫ్టీలో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టైటాన్ కంపెనీ, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ ప్రధాన నష్టాలను చవిచూశాయి.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ఓవల్ కార్యాలయంలో షరీఫ్, మునీర్‌తో ట్రంప్ రహస్య చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భేటీకాబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్‌కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని,…