ట్రంప్ ఒటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారినే అని చేప్పాలి. కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు విమర్శలు చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ట్రంప్ చైనాపై అనేకమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే…
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్క్లూనీ…