ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పుడు మూడో దేశం అమెరికా కూడా తోడవుతోంది. ఇరాన్‌పై యుద్ధానికి రంగంలోకి దిగుతోంది. ఇక అమెరికా రంగంలోకి దిగితే.. ఇరాన్ మిత్ర దేశాలు కూడా రంగంలోకి దిగే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: Chevireddy Bhaskar Reddy: చంద్రబాబుకు భయం పుట్టాలి.. చెవిరెడ్డి వాయిస్ మెసేజ్!
ఇదిలా ఉంటే జీ 7 సమ్మిట్ నుంచి ట్రంప్ అర్థాంతరంగా వెళ్లిపోయారు. వైట్‌హౌస్‌లో జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఇరాన్‌పై యుద్ధం చేస్తే జరిగే పరిణామాల గురించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సమావేశం అనంతరం ట్రంప్-ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. ఇరువురి మధ్య ఇరాన్‌పై యుద్ధం చేసే అంశంపై చర్చించారు. అలాగే సిచువేషన్ రూమ్‌లో జరిగిన సంభాషణను పంచుకున్నారు. ఇరాన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగాలనే అమెరికా సిద్ధపడుతోంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కావాలనే అంతం చేయలేదని.. ఇప్పటికైనా ఆలస్యం ఏమీలేదని.. అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే మంచిదని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇక ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఖమేనీ కూడా ఎక్స్‌లో యుద్ధానికి రెడీ అంటూ పోస్ట్ పెట్టారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: ట్రంప్-మోడీ మధ్య 35 నిమిషాలు ఫోన్ కాల్.. 5 విషయాలు ప్రస్తావన
దాదాపు వైట్‌హౌస్‌లో 80 నిమిషాల పాటు జాతీయ భద్రతా సలహాదారు బృందంతో టంప్ సమావేశమయ్యారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికా ముందున్న మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగాలనే ప్రణాళికను ట్రంప్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కీలక అణుశుద్ధి కేంద్రమైన ఫోర్డోలోని భూగర్భ భాగంపై దాడులు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. పర్వతం లోపల లోతుగా దాచబడిన ఫోర్డో ప్లాంట్‌ను ధ్వంసం చేసేందుకు వైట్‌హౌస్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం GBU-57 బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సియోస్ నివేదించింది. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు ప్రత్యేకంగా పని చేయగలవని యూఎస్ సైన్యం భావిస్తోంది. GBU-57 బంకర్ బస్టర్.. లోతుగా పాతిపెట్టబడిన లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుంది. 61 మీటర్ల వరకు భూగర్భంలోకి చొచ్చుకుపోగలదు. అనుకున్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. ఇరాన్ అణు స్థావరాలు నాశనం చేయడం అమెరికా ఆయుధ సామగ్రికే సాధ్యమని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ప్రస్తుతం ఆ సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు.
ప్రస్తుతం అమెరికాకు చెందిన అత్యాధునిక బాంబర్లు హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలోని అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ నుంచి దాదాపు 2,358 మైళ్ళు (3,796 కి.మీ) దూరంలో ఉన్నాయి. కార్యకలాపాలు నిర్వహించే పరిధిలోనే ఈ బాంబర్లు ఉన్నట్లుగా బీబీసీ తన నివేదికలో పేర్కొంది.